
పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ నవంబర్ 2గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణం లోని ప్రభుత్వం అస్పటల్ ముందు ధర్నా నిర్వహించిన ఏ న్ హెచ్ ఏం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి 78 కేడర్ల సిబ్బందికి న్యాయం చేయాలి: దళిత సంఘాల రాష్ట్ర నాయకుడు తుమ్మ శ్రీనివాస్ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ఏ న్ హెచ్ ఏం పరిధిలో గత 20 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని దళిత సంఘాల రాష్ట్ర నాయకుడు తుమ్మ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఞ్చమ్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో ఞ్చమ్ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. మాతా శిశు సంరక్షణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, కంటి వెలుగు, టీబీ నిర్మూలన, ఆరోగ్య మహిళ వంటి అనేక ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు.రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం, వేతనాల చెల్లింపుల్లో సమస్యలు ఎదురవడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ నిరంతరం సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా పరిష్కరించాలని కోరారు.ఞ్చమ్ పరిధిలోని 78 కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, క్రమబద్ధీకరణ చేపట్టాలని తుమ్మ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని, ప్రతి నెలా ఐదో తేదీలోపు జీతాలు అందించాలని కోరారు. అదేవిధంగా ఏటా 5 శాతం ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఔట్సోర్సింగ్ ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులను నేరుగా స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలో కొనసాగించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్న ఞ్చమ్ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తుమ్మ శ్రీనివాస్ కోరారు.